Sunday, May 4, 2025
- Advertisement -

ఐపీఎల్ సీజ‌న్‌లో లో గంభీర్ రికార్డును అధిగమించిన కోహ్లీ

- Advertisement -

ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను బాగా మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌తో బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ.. గౌతమ్‌ గంభీర్‌ రికార్డును అధిగమించాడు.

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ… ఐపీఎల్ లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ను మూడో స్థానానికి నెట్టేశాడు.

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 3,683 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 3,525 పరుగులు, గంభీర్ 3,518 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లు ఉన్నారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఈ ఘనతను సాధించాడు.

టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో బెంగళూరు… సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ సేన ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌ కూడా తప్పక గెలవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -