Thursday, May 8, 2025
- Advertisement -

టీ20ల్లో కోహ్లీనే టాప్.. మరో రికార్డ్..!

- Advertisement -

శుక్రవారం రాత్రి ఉప్పల్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టిమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ తో వెస్టిండీస్ పై చెలరేగిపోయాడు. 208 పరుగుల భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ (94 నాటౌట్: 50 బంతుల్లో 6×4, 6×6) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.

టీ20ల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డ్ ని బద్దలుకొట్టిన కోహ్లీ నెం.1 స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకూ అత్యధిక అర్దశతకాలు సాధించిన క్రికెటర్ గా రోహిత్ శర్మ 22 హాఫ్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. ఉప్పల్ టీ20లో 23వ హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లి అతడ్ని వెనక్కి నెట్టి నెం 1 స్థానాన్ని అధిరోహించాడు.

ఇక ఈ రికార్డులో కోహ్లి తర్వాత రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (17 హాఫ్ సెంచరీలు), పాల్ స్ట్రిర్లింగ్ (16), డేవిడ్ వార్నర్ (16) టాప్-5లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 మ్యాచ్‌ తిరువనంతపురం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -