- Advertisement -

విరాట్ ఫేక్ ఆస్కార్ అవార్డ్‌కి షేక్ అవుతున్న సోషియ‌ల్ మీడియా

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ‌కి ఆస్కార్ అవార్డ్ దక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్న విరాట్‌కు ఆస్కార్ అవార్డ్ ఇస్తార‌నుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే.సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉండే కోహ్లీ త‌న సొంత ఫ్యాషన్ బ్రాండ్ అయిన ‘రాంగ్‌’ను ప్రమోట్ చేయడానికి “ట్రైలర్ ద మూవీ” అనే ప్రమోషనల్ వీడియో రూపొందించారు.

సెప్టెంబర్ 25న టీజర్ రిలీజ్ చేసి…26న ఏకంగా “ట్రైలర్ ద మూవీ” వీడియోను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విరాట్ హాలీవుడ్ హీరోలా దర్శమివ్వడం మాత్రమే కాదు…తన యాక్టింగ్ స్కిల్స్ సైతం ప్రదర్శించాడు. ఇది, నిజమేనని నమ్మిన అభిమానులు ఆశ్చర్యపడటమే కాకుండా సంతోషమూ వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ఈ ట్వీట్ గురించి కోహ్లీ ప్రస్తావిస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి అభిమానులను మళ్లీ ఆశ్చర్యపడేలా చేశాడు. ‘నేను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ‘ఆస్కార్’ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్ ప్రొడక్షన్ కు, ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ఫేక్ చిత్రం కనుక ఇది ఫేక్ ‘ఆస్కార్’’ అని ఆ వీడియోలో కోహ్లీ అసలు విషయం చెప్పేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -