- Advertisement -

అక్షర్ స్థానంలో వాషింగ్టన్..సరైన నిర్ణయమేనా?

- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది టీమిండియా. సూపర్ 8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యచ్‌లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టులో వైస్ కెప్టెన్‌ను తప్పించడం కొత్త విషయం కాదు. శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాడు కూడా ఇటీవల ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించబడ్డాడు. అందువల్ల సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు.

ఈ జట్టులో హోదాలకు ప్రత్యేక ప్రాధాన్యం లేదనేది స్పష్టమే. కానీ ఆ నిర్ణయం భారత్‌కు ఖరీదైంది. డేవిడ్ మిల్లర్ ధాటికి భారత్ భారీ ఓటమి చవిచూసింది.
అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడం క్రికెట్ పరంగా సరైనదా అనే ప్రశ్న తలెత్తింది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్‌లో వాషింగ్టన్ స్థిరంగా ఆడలేదు. గత సీజన్‌లో జట్టు ఆడిన 15 మ్యాచ్‌లలో కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ఏడు మ్యాచ్‌లలో మూడు మాత్రమే ఆడాడు.

అయితే సహాయ కోచ్ ర్యాన్ టెన్ డూషాటే మాట్లాడుతూ..ఐపీఎల్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడన్నది ఎంపికకు ప్రమాణం కాదు. భారత జట్టుతో ఉన్నప్పుడు వాషీ చేసిన ప్రదర్శన ఆధారంగానే మేము నిర్ణయం తీసుకుంటాం అన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్‌ను ప్రాధాన్యం ఇచ్చారు. అదనపు బ్యాటర్‌గా రింకూ సింగ్‌ను తీసుకోవడంతో వాషింగ్టన్, అక్షర్ మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ రోజు వాషింగ్టన్‌ను ఎంపిక చేశారు.

కానీ ఆ నిర్ణయం ఫలించలేదు. వాషింగ్టన్ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు, వికెట్ దక్కలేదు. ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా వాషింగ్టన్-శివం దూబే కలిపి నాలుగు ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశారు. వరుణ్ చక్రవర్తి కూడా ఆ రోజు ప్రభావం చూపలేకపోయాడు. అలాంటి సమయంలో అక్షర్ లాంటి అనుభవజ్ఞుడి అవసరం స్పష్టమైంది.

వాషింగ్టన్ బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేక 11 బంతుల్లో 11 పరుగులే చేశాడు. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లను తప్పుగా అంచనా వేసి ఒకటి సిక్స్, మరొకటి ఫోర్‌గా మారాయి.అక్షర్ గత రెండు సంవత్సరాల్లో భారత్‌కు కీలక విజయాలు అందించాడు – 2024 వరల్డ్ కప్‌లోనూ, కొలంబోలో పాకిస్తాన్‌పై మ్యాచ్‌లోనూ అతని ప్రదర్శనలు గుర్తుండేలా ఉన్నాయి. అనుభవ పరంగా కూడా అక్షర్, కుల్దీప్ యాదవ్‌ల కంటే వాషింగ్టన్ వెనుకబడి ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -