Wednesday, May 7, 2025
- Advertisement -

ఆ రోజు నింజంగా రోహిత్ ను బూతులు తిట్టలేదు : డేవిడ్ వార్నర్

- Advertisement -

క్రీకెట్ ఆటలో గెలుపు, ఓటమిల గురించి పక్కన పెడితే.. ఆసీస్ ఆటగాళ్లంటే.. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా బానే ఇష్టపడుతారు. ఇక డేవిడ్ వార్నర్ హైదరాబాద్ కు సన్ రైజర్స్ తరుపున ఫస్ట్ కప్పును తీసుకొచ్చాడు. 2014-15 సిరీస్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పెద్ద దూమారమే చేలరేగింది.

ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన క్రమంలో రోహిత్ శర్మ-డేవిడ్ వార్నర్ ల వివాదంపై మరోసారి స్పందించాడు. ‘టాక్ ఇన్ ఇంగ్లీష్’ అంటూ వార్నర్ అరిచినట్లు అందరూ అనుకున్నారు. అదే మాట అన్న అని వార్నర్ కూడా అప్పట్లో తెలిపాడు. ఈ విషయంపై స్పందించిన వార్నర్ మ్యాచ్ లో రోహిత్ శర్మ హిందీలో ఏదో మాట్లాడాడు. అది నాకు అర్దం కాకపోవడంతో ఇంగ్లిష్ లో మాట్లాడు అని చెప్పాను. హిందీ రానప్పుడు నాకు రోహిత్ ఏం చెప్తున్నాడో ఎలా అర్ధం అవుతుంది. అందుకనే.. ఇంగ్లిష్ లో మాట్లాడమని చెప్పానని అప్పటి వివాదం గురించి చెప్పాడు.

నేను మాట్లాడింది ఏమిటో నా పెదవుల కదలికల్ని బట్టి అర్థమవుతుంది. అంతేకానీ నేను ఎటువంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదు అని వార్నర్ చెప్పాడు. కొద్ది రోజుల్లో యాషెష్ ప్రారంభం కానున్న తరుణంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఆ సమయంలోనే వార్నార్ తాను అన్న మాటల గురించి గుర్తు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -