Sunday, April 28, 2024
- Advertisement -

రోహిత్ కెప్టెన్సీ వల్లే.. ఈ ఫెయిల్యూర్స్ ?

- Advertisement -

టీమిండియా ప్రస్తుతం అత్యంత ఘోర పరాభవాలను ఎదుర్కొంటోంది. ప్రపంచ మేటి జట్టుగా పేరుగాంచిన టీమిండియా..ఇంత ఘోరంగా విఫలం అవ్వడం ఏంటని యావత్ సగటు క్రికెట్ అభిమాని తీవ్ర నిరుత్సాహనికి లోనవుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెపెన్సీ బాద్యతలు చేపట్టిన తరువాత టీమిండియా ఓటమిల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది అన్నీ ఫార్మాట్లలో కలిపి ఆరు సిరీస్ లలో టీమిండియా దారుణ ఓటములు చూసింది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ మొదలుకొని ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ వరకు ఏ సిరీస్ లోనూ రోహిత్ సేన చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేక అపజయాలను మూటగట్టుకుంది.

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ మరియు వన్డే సిరీస్ రెండిటిలోను టీమిండియా విఫలం అయింది. ఆ తరువాత ఇంగ్లండ్ తో జరిగిన 5వ టెస్ట్ లో కూడా ఓటమి చవి చూసింది. ఇక ఎన్నో అంచనాల మద్య ఆసియా కప్ బరిలోకి దిగిన రోహిత్ సేన, అందరి అంచనాలను తలకిందుయికు చేస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక వరల్డ్ కప్ లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుని కప్ సాధిస్తుందని ఆశించిన అభిమానులు మళ్ళీ నిరాశనే మిగిల్చింది. సెమీల్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో అసలు ఆడుతోంది టీమిండియనేనా అనే డౌట్ ప్రతి క్రీడాబిమాని వ్యక్తం చేశాడంటే రోహిత్ సేన ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై దారుణమైన విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఆటగాళ్లను సరిగ్గా వినియోగించుకోవడంలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలం అవుతున్నాడని, కూల్ గా ఉంటూ మ్యాచ్ ను ముందుకు నడిపించాల్సిన కెప్టెనే జట్టు ఆటగాళ్లపై అరుస్తూ అసహనం ప్రదర్శిస్తూ తోటి ఆటగాల్లో నిరుత్సాహం నిపుతున్నాడనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ కారణం చేతనే టీమిండియా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో కూడా రోహిత్ సేన మరోసారి విఫలం అయింది. దీంతో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరో వైపు మాజీలు సైతం రోహిత్ కెప్టెన్సీ పై చురకలు అంటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -