Sunday, May 19, 2024
- Advertisement -

ఓట‌మిపై ఇన్‌స్టా గ్రామ్‌లో మొద‌టి సారి స్పందించిన మార్టిన్ గుప్తిల్‌….

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్ ల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ న్యూజిలాండ్ ఓడింది. ఓడినా క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఓట‌మిపై మార్టిన్ గుప్తిల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ఫైనల్‌ మ్యాచ్‌ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ తెలిపాడు. ఫైనల్‌ టై కావడం… అనంతరం నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచింది. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్‌ టైటిల్‌ అందుకోకపోవడంలో గప్టిల్‌ది కాదనలేని పరోక్షపాత్ర. ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌ని మార్టిన్ గుప్తిల్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు.

‘లార్డ్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్‌ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్‌ నిలిచింది. కానీ న్యూజిలాండ్‌ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

https://www.instagram.com/p/B0O2H2IHTO5/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -