Saturday, May 3, 2025
- Advertisement -

World Cup 2023:సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ వీరే

- Advertisement -

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుండి వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే అన్నిజట్లు భారత్‌కు చేరుకోగా ఈ మెగా టోర్నీ విజేత ఎవరు అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా రోహిత్ సారథ్యంలో భారత్ టోర్నీ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. 251 వన్డేల్లో 10112 పరుగులు చేశాడు. ఇక రోహిత్ ఫాంలో ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం.

ఇక ఒకసారి వరల్డ్ కప్‌ హిస్టరీ పరిశీలిస్తే..జట్టుకు అత్యధిక విజయాలను అందించిన టాప్ 5 కెప్టెన్స్‌లోని మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఇక ఆసీస్‌కు తన కెప్టెన్సీలో రెండు ప్రపంచకప్‌లను అందించారు రికీ పాంటింగ్. 2003,2007 టైటిల్స్ అందించిన పాంటింగ్‌ మొత్తం 29 మ్యాచ్‌ల్లో 26 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు విజయాన్ని అందించాడు.

తర్వాతి స్ధానంలో వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్ లాయిడ్ ఉన్నారు. 1975, 1979 వరల్డ్ కప్‌లను విండీస్‌కు అందించిన లాయిడ్ కెప్టెన్‌గా మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 15 వన్డేల్లో గెలిపించాడు. తర్వాత స్ధానంలో న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు. అయితే ఫ్లెమింగ్ జట్టుకు ఒక వరల్డ్ కప్ అందించక పోయినా మొత్తం 27 మ్యాచ్‌ల్లో 16 సార్లు జట్టును గెలిపించాడు.

ఇక బారత్‌కు చెందిన ధోని…వన్డే వరల్డ్ కప్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా 17 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడి 14 వన్డేల్లో విజయం సాధించాడు. ఇక తర్వాత పాక్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. 1992 వరల్డ్ కప్‌ని అందించిన ఇమ్రాన్ ఖాన్.. 22 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండి 14 వన్డేల్లో పాక్‌ను గెలిపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -