- Advertisement -
టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి కాబోతున్నాడా? అంటే నిజమే అంటున్నారు మీడియా వర్గాలు. యువరాజ్ సింగ్ రెండు సంవత్సరాల క్రితం హాలీవుడ్ నటి హేజెల్ కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2016 నవంబర్ 30వ తేదీన యూవీ, హేజెల్ సిక్కు సంప్రదాయ వివాహంతో ఒక్కటయ్యారు. తర్వాత డిసెంబర్ 2వ తేదీన గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు.
తాజాగా మనకు అందుతున్న సమచారం ప్రకారం యువరాజ్ – హేజెల్ కీచ్‌లు తల్లిదండ్రులుగా మారబోతున్నారట.అయితే ఈ విషయంపై యూవీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా ఈ జంట అంబానీ ఇంట వివాహానికి హాజరైన సమయంలో.. ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!