ప్రపంచీకరణపై దృష్టి పెట్టిన దేశాలు పర్యావరణాన్ని మాత్రం గాలికొదిలేస్తున్నాయి. మనం చేసే తప్పిదాల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోది. ప్లాస్టిక్ వాడకాన్ని విపరీతంగా వాడటం వల్ల అది పర్యావరణానికి శాపంగా మారింది.దీంతో ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతున్నాయి. పర్యావరణానికి మనిషితో ఎంత ముప్పో తాజా పరిశోధనలు కళ్లకు కడుతున్నాయి.
రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకం పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తున్నదో ఈపోటోచూస్తే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో మనం వేస్తున్న ప్లాస్టిక్ అంతా ఇప్పుడు ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలుతున్నది. ఈ సముద్రాల్లో శక్తివంతమైన ప్రవాహం ఈ చెత్తనంతటినీ ఉత్తరం దిశగా తీసుకెళ్లి ఆర్కిటిక్‌లో కలిపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంటార్కిటికాలో ఇప్పుడ దాదాపు 30 వేల కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు ఆర్కిటిక్ నీటిపై తేలుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది కొందరి వాదన. గ్రీన్‌ల్యాండ్ తూర్పు తీరం, స్కాండివేనియా ఉత్తర దిశగా ఈ ప్లాస్టిక్ చెత్తను కనుగొన్నారు. 2013లో టారా అనే రీసెర్చ్ నౌకపై వెళ్లిన సైంటిస్టులు.. గ్రీన్‌ల్యాండ్, బేరెంట్స్ సముద్రాల్లో ఈ చెత్తను గుర్తించారు. ఇదంతా ఉత్తర దిశగా పయనించి ఆర్కిటిక్‌లో కలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాల్లో తేలుతున్న ప్లాస్టిక్‌కు ఇదే గమ్యస్థానమని ఈ ప్రాంతానికి సైంటిస్టులు పేరు పెట్టారు.
అయితే ఆర్కిటిక్ మహా సముద్రానికి ప్లాస్టిక్ పయనం ఇప్పుడే మొదలైందని వాళ్లు వెల్లడించారు. 60 ఏళ్ల నుంచే మనం ప్లాస్టిక్‌ను వాడుతున్నాం. రోజురోజుకీ దీని వాడకం పెరిగిపోతున్నది. అంటే చాలా వరకు మనం సముద్రాల్లో వేసిన చెత్త ఇంకా ఆర్కిటిక్ వైపు ప్రయాణించే దశలోనే ఉంది అని ఈ అధ్యయనంలో సభ్యుడైన కార్లోస్ డ్యుయర్టె తెలిపారు.
ఈ అధ్యయనాన్ని స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాడిజ్ సహా డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్పెయిన్, యూకే, యూఎస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఆర్కిటిక్‌లో అతి తక్కువ జనాభా ఉండటం, ఆ ప్లాస్టిక్ వ్యర్థాల స్థితి, చిన్నచిన్న భాగాలుగా విడిపోయిన ప్లాస్టిక్‌ను చూస్తే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో వేసిన చెత్తేనని శాస్త్రవేత్తలు తేల్చారు.ఇదే కొనసాగితే పరిస్తితులు మరింత దారునంగా ఉంటాయని ….దీనికి నివారన చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Related