Friday, May 24, 2024
- Advertisement -

చంద్రబాబుకి లెటర్ రాసి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి

- Advertisement -
Unemployed student wrote letter cbn

ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి హామీలు ఇవ్వ‌డం సాదార‌నం. కానీ అమ‌లుకానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతుంటారు.  2014 ఎన్నిక‌ల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా భావించి ఇస్ట‌మొచ్చిన  హామీలును మేన‌పెస్టోలో పెట్టి అధికారాన్ని చేప‌ట్టారు సీఎం నారాచంద్ర‌బాబు నాయుడు. బాబులాగా జ‌గ‌న్ కూడా అలాంటి హామీలు ఇచ్చి ఉంటే ఈపాటికి అధికారంలో ఉండేవాడు. కానీ అలాచేయ‌లేదు. ఎదుకంటే అధికారం కంటే ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ముఖ్య‌మ‌ని అములు చేసే హామీల‌నుమాత్ర‌మే ప్ర‌క‌టించారు.కానీ గొర్రెక‌సాయివాన్ని న‌మ్మిన‌ట్టు… చంద్ర‌బాబును న‌మ్మి ఒటు వేసిన  అధికారం అప్ప‌గించారు. అంతే ఇంకే ముంది ప్ర‌జ‌ల‌కు చుక్కుల చూపిస్తున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు ఇచ్చిన 600 వంద‌ల హామీల‌లో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సిది  ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నిరుద్యోగ  భృతికింద‌ వారికి నెల‌కు  రూ.2000 అంద‌జేస్తామ‌ని  ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇంకేముంది అనుకున్న‌ట్లుగానే అధికారంలోకి  రావ‌డంతో యువ‌కులంతా సంబ‌ర‌ప‌డిపోయారు. ఉద్యోగం వ‌చ్చేంత వ‌ర‌కు త‌ల్లిదండ్రుల‌మీద ఆధార‌ప‌డ‌కుండా చ‌దువు పూర్త‌య్యాక ఉద్యోగం సంపాదించుకోవ‌చ్చ‌ని ఆశ‌ప‌డ్డారు.కానీ వారి ఆశ‌లు అడియాశ అయ్యాయి.ల‌క్ష‌లు ఖ‌ర్చుచేసి కోచింగ్‌లు తీసుకొని నిరుద్యోగ భృతికోసం స‌ర్కారు ఉద్యోగ నోటిఫికేష‌న్‌ల‌కోసం ఎదురుచూస్తున్నారు.

నిరుద్యోగ భృతి వ‌స్తాద‌ని ఎదురు చూసిన యువ‌కుడు చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వైజాగ్ న‌గ‌రంలోని యాత‌పాలెం ప్రాంతానికి చెందిన పితాని రాజు,వ‌ర‌ల‌క్ష్మి దంప‌తుల కొడుకు శివ‌ప్ర‌సాద్  మ‌ర్రిపాళెం వ‌ద్ద రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.తాను ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది రాసిన లెట‌ర్‌ను అత‌ని త‌ల్లిదండ్ర‌లు పోలీసుల‌కు అంద‌జేశారు.  విలేక‌రులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం పితాని శివ‌దుర్గా ప్ర‌సాద్ బీటెక్ చ‌దివి ఏడు సంవ‌త్సారాలు పూర్త‌యినా ఉద్యోగం  ఎక్క‌డా దొర‌క‌లేదు.  రెండేళ్ల‌క్రితం పెల్లి చేసుకున్న శివ‌ప్ర‌సాద్ కుటుంబ‌నిమిత్తం చిన్న చిన్న ప‌నులు చేసెవాడు. ఈనెల 7న రైలు కింద‌ప‌డి ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుక‌న్నాడో కుటుంబ స‌భ్యుల‌తో స‌హా ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డంలేదు.

లేఖ‌లో ప్ర‌ధానంగా  నేను బీటెక్ పూర్తి చేశాను.. ఎక్క‌డా ఉద్యోగం దొర‌క‌పోవ‌డంతో మ‌న‌స్తాపం చెందాను. ఎంతో మంది ఉన్న‌త చ‌దువులు చ‌దువుకున్నా ఉద్యోగంలేక  నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. వీరంద‌రికీ ఉపాధి దొర‌కాలి నాలాగా ఎవ‌రూ చ‌నిపోకూడ‌దు…. విశాఖ‌కు రైల్వే జోన్ రావాలి….అది వ‌స్తే చ‌దువుకున్న యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయి… ద‌య‌చేసి నా అభ్య‌ర్థ‌న మేర‌కు విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరుకుంటున్నాను అంటూ… సీఎం  చొరువ తీసుకొని రైల్వేజో్న్ వ‌చ్చేందుకు కృషిచేయాల‌నీ కోరుకుంటూ సీఎం చంద్ర‌బాబు నాయుడికి లేఖ రాశారు. 

ఈలేఖ‌ను చూసౌనా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని రైల్వే జో్న్ వ‌చ్చేవిధంగా కృషిచేయాలి . నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి. శివ ప్ర‌సాద్ లాగా ఎవ‌రూ చ‌నిపోకూడ‌ద‌ని ఇప్ప‌టి కైనా పాల‌కులు కల్లు తెర‌వాల‌నీ ప్ర‌జ‌లు,నిరుద్యోగ యువ‌త కోరుకుంటున్నారు.

Related

  1. త్వ‌ర‌లోజ‌గ‌న్‌తో శిల్పామోహ‌న్‌రెడ్డి భేటీ
  2. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  3. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. చంద్రబాబుపై కోపంతోనా..?
  4. జగన్ కు ఎంత గొప్ప మనసు ఉందో ఇది చదివితే తెలుస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -