Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ర్యాంక్ లు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది, మంత్రులు ఎంత బాగా పని చేస్తున్నారు , ఎమ్మెల్యే లు ఏవిధంగా తమకి వచ్చిన ఫండ్స్ ని వాడుకుని సకాలం లో బాధ్యతలు పూర్తి చేస్తున్నారు ఇవన్నీ స్వయంగా అబ్జర్వ్ చేస్తూ వారికి ర్యాంక్ లు ఇస్తూ ఉంటారు చంద్రబాబు.

అలాంటి చంద్రబాబు కి ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీ ర్యాంకింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. గత వారం రోజుల నుంచీ ముఖ్యమంత్రుల పని తీరు మీద మోడీ ఇచ్చిన ర్యాంకుల గురించి మీడియా లో వార్తలు వస్తూ ఉన్నాయి.

ఈ ర్యాంకుల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి వ‌చ్చిన ర్యాంకు ఎంతో తెలుసా… 13వ స్థానం! అవును, అందుకే ఇప్పుడు చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు కూడా తెలుగుదేశం వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త విధానాల‌ను ప్ర‌వేశపెట్టిన మ‌న‌కు 13వ ర్యాంకు రావ‌డం ఏంట‌ని కొంత‌మంది అధికారుల‌తో చంద్ర‌బాబు వాపోయార‌ట‌! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -