Friday, May 10, 2024
- Advertisement -

కెసిఆర్ vs చంద్రబాబు

- Advertisement -

ఒలంపిక్స్ లో ఏ ముహూర్తం లో మెడల్ సాధించిందో కానీ ఒలంపిక్స్ విజేత సింధూ కి భారీ అవార్డులు, నజరనాలూ దక్కుతున్నాయి. పరిపాలన విషయం లో పోటీ పడే చంద్రబాబు – కెసిఆర్ లు ఇప్పుడు ఈమె విషయం లో కూడా హడావిడి చేస్తున్నారు. అంత హడావిడి చేసి ఆమెని ఆహ్వానించిన కెసిఆర్ సర్కారు నిన్నంతా హడావిడి చెయ్యగా ఇవాళ ఆపనిలో పడింది ఏపీ సర్కారు.గన్నవరం నుంచీ ఆమెని ఆహ్వానిస్తూ తీసుకొచ్చారు విజయవాడ కి.

ఇప్పుడు జిల్లాల విభజన లో కూడా కెసిఆర్ – చంద్రబాబు ల మధ్యన పోటీ నెలకొంది అంటున్నారు. తెలంగాణలో పది జిల్లాలను 27 జిల్లాలుగా విభజిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లే ఏపీలో 36 జిల్లాలను ఏర్పాటుచేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.

తొమ్మిది అనే లక్కీనెంబరుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా 27 జిల్లాలను ఏర్పాటుచేసిన కేసీఆర్ దారిలోనే బాబు నడుస్తారని చెప్తున్నారు. 36ను కూడితే 9 వస్తున్న నేపథ్యంలో ఇదే సంఖ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా బాబు నిర్ణయం వెనుక రాజకీయ కారణం కూడా ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -