హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కూతురు వివాహం ఘనంగా జరిగింది. గురువారం ఉదయం బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని జిగ్నేష్‌కి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పంక్షన్ గచ్చిబౌలిలోని మినీ స్టేడియం లో జరిగింది.
ఈ పెళ్లికి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన వారిలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కేటీఆర్, నటుడు చిరంజీవి, రామోజీ రావు తదితరులు హాజరయ్యారు.