ఖరీదైన ఫోన్ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు యాపిల్.. సామ్‌సంగ్ ఫోన్‌లు . వాటి ఖరీదు చూసుకుంటె యాపిల్ నుంచి కొత్త ఫోన్ విడుదలైందంటే.. రూ. 50వేలకు తక్కువైతే ఉండదు.
ఇక సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో కొన్ని ఫోన్లు కూడా రూ. 40 నుంచి రూ. 60వేల వరకు పలుకుతున్నాయి. అంతకంటే ఖరీదైన ఫోన్లు కొన్ని మార్కెట్లలో ఉన్నాయట. మరి అఫోన్ ధర ఎంతో తెలుసుకుందాం.
{loadmodule mod_custom,Side Ad 1}
అత్యంత లగ్జరీ, కాస్ట్లీ ఫోన్లను తయారుచేసే వర్చ్యూ సంస్థ తన తాజా మోడల్‌ను విడుదల చేసింది. ఈకంపెనీ నుంచి విడుదలైన ఫోన్ల ధరలు రూ. లక్షల్లో ఉంటాయి. అయితే తాజాగా ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను విడుదల చేసింది. దాని ధర అక్షరాల రూ. 2.3కోట్లకు పైమాటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ఇది నిజం.
బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ వర్చూ సిగ్నేచర్ కోబ్రా ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.పరిమిత ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర 3.6లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2.3కోట్లకు పైమాటే.పేరుకు తగ్గట్టే ఈ ఫోన్ అంచుల చుట్టు ఓ పాము ప్రతిమను ముద్రించి ఉండటం ఇందులోని ప్రత్యేకత. 439 కెంపులను పొదిగి ఈ ఫీచర్ ఫోన్‌ను రూపొందించారు. ఇక పాము కళ్లను పచ్చలతో పొదిగారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ఈఫోన్‌లను కేవలం ఎనిమిది యూనిట్ల ఫోన్‌ను మాత్రమే తయారుచేశారు. ఈ ఫోన్ కొనాలని ఆసక్తి కలిగిన వాళ్లు చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ జేడీ.కామ్‌లో బుక్ చేసుకోవచ్చు. 145 డాలర్లు అదనంగా చెల్లించి ప్రీ-బుకింగ్ కూడా చేసుకోవచ్చు. పోన్ ఫీచర్లు అన్ని పోన్‌లాగానే ఉన్నాయి.రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, ఐదున్నర గంటలసేపు ఫోన్ చేసి మాట్లాడుకోగల బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి.ఇదండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read