Saturday, May 18, 2024
- Advertisement -

ప్రాణాలు తీసె మిర‌ప‌కాయ‌ను సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు

- Advertisement -
Red chillies..Beware the Dragon’s Breath

మిర‌ప‌కాయ‌ల‌ను మ‌నం ప్ర‌తీ రోజు ఆహార వంట‌కాల‌లో ఉప‌యేగిస్తుంటాం. అవి లేకుండా ఏఇంట్లో వంట‌లు ఉండ‌వు.మిర‌ప‌కాయ‌ను మ‌నం రుచి ,కాస్త‌మంట‌కోసం వాడ‌టం స‌హ‌జం.

లేకుంటె ఒక‌టి రెండు మిర‌ప‌కాయ‌లు తినేటోల్లు ఉన్నారు.కానీ కానీ ఈ మిర‌ప‌కాయను తింటె క్ష‌ణాల్లో మీప్రాణాలు గాల్లో క‌ల‌సిపోతాయి. మిర‌ప‌కాయ తిన‌డం ఏంటి ప్రాణం పోవ‌డం ఏంట‌ని ..అనుకుంటున్నారా..!మీకె వింటున్న‌ది నిజ‌మే.
శాస్త్ర విజ్ఞాన జగత్తులో అనుకోకుండా జరిగే కొన్ని పొరపాట్లు కొన్నిసార్లు ప్రాణాలు తీస్తాయి. ఈ మిరపకాయ కూడా అలాగే పుట్టింది. ఇది ఎంతో ఘాటైన మిరపరకం. దీనికి డ్రాగన్ బ్రీత్ అనే పేరు కూడా పెట్టారు. దీనికి అర్థం చచ్చేంత కారం. కానీ ఇది నిజానికి చంపేంత కారం గల దారుణ రకం. యునైటెడ్ కింగ్‌డమ్‌లో నాటింగ్ హమ్ ట్రెండ్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు వేల్స్‌కు చెందిన స్మిత్ అనే రైతుతో కలిసి దీనిని పండించారు. ఇది తింటే ప్రాణాలకే ప్రమాదమని ఆ తర్వాత పరిశోధకులు తేల్చారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఒక వేల దీన్ని తీసుకుంటె పరీతమైన అలర్జీతో ఉక్కిరిబిక్కిరౌతారు.శరీరంపై తీవ్రమైన దురద కలిగించే పొక్కులు, దద్దులు వస్తాయి. గొంతు లేదంటే నాలుక విపరీతంగా వాచిపోవడం, వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అంతేకాదు, తలతిరిగి పోవడం, రక్తపోటు తగ్గిపోవడంతో పాటూ విపరీతంగా వాంతులతో వ్యక్తి ఉక్కిరిబిక్కిరై పోతారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు దక్కడం అసాధ్యం. దీనినుంచి తీసిన చమురు ప్రత్యేక సందర్భాల్లో మత్తుమందుగా ఉపయోగపడవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత కారం ఉన్న మిరపరకంగా ‘డ్రాగన్స్‌ బ్రీత్‌’ ప్రత్యేకంగా గిన్నిస్‌ రికార్డుకెక్కాలన్నది రైతు మైక్‌స్మిత్‌ ఉద్దేశంగా ఉంది. ఈ మేరకు గిన్నిస్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -