చంద్రబాబు నీ కెసిఆర్ నీ కలిపింది ఎవరంటే ..

ఓటుకు నోటు , ఫోన్ ట్యాపింగ్ లాంటి భారీ అంశాల తో ఒకరికి ఒకరు దొరికిన చంద్రబాబు నాయుడు – కెసిఆర్ లు ఒకరిని ఒకరు ఎంతగా తిట్టుకున్నారో మనం కళ్ళారా చూసాం కదా. ఇలాంటి పరిస్థితి లో ఎన్నో నెలలు గడవక ముందరే వారు మళ్ళీ కలవడం తో ఆశ్చర్యపోవడం తెలుగు జనాల వంతు అయ్యింది.

వారిద్దరినీ కలపాడానికి వెనక ఎవరు పని చేసారు ? ఎవరి ప్రోద్బలం ఉంది అనేది చూస్తే అదంతా కేవలం మోడీ లేదా వెంకయ్య నాయుడు ల హస్తం అనుకుంటే పొరపాటే వారి ఇద్దరి వెనకా పెద్ద శక్తి వారిని కలిపింది అని చెబుతున్నాడు మత్తయ్య. 

ఓటుకు నోటు కేసు లో పెద్ద తలకాయ గా విజయవాడ లో తలదాచుకున్న అతను ఇప్పుడు ఇద్దరూ కలవడం తో చాలా సంతో షంగా ఉన్నాడు.  క్రైస్తవుల ప్రార్థనల కారణంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని.. ఈ అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి.. క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాలంటూ మత్తయ్య పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.