‘పుష్ప’ ఫస్టులుక్ వచ్చేసింది.. టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆర్య, ఆర్య2 తర్వాత బన్ని-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

బన్ని పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. తాజాగా టైటిల్& ఫస్ట్ లుక్ రిలీజైంది. పుష్ప అనేది సినిమా టైటిల్. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్ని పూర్తి మాసీగా .. రగ్గ్ డ్ గా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం.. గుబురు మీసం..బాగా పెరిగిన జుత్తు.. చెమటలతో తడిసిన రూపం.. పైగా తీక్షణమైన చూపులతో బన్నీ పాత్ర ఎంత ఎగ్రెస్సివ్ గా మాసీగా ఉండనుందో పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఆ గళ్ల చొక్కా చూస్తుంటే ఒక విలేజీ కుర్రాడిగానే బన్ని కనిపించనున్నాడన్నమాట. ఇక ఈ టైటిల్ సరిగ్గా కనిపిస్తే గంధపు చెక్కలు కనిపిస్తాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘పుష్పక్ నారాయణ్’.

ఇక ఈ చిత్రాన్ని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం సహా సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. నాలుగు భాషల టైటిల్ పోస్టర్లను నేడు లాంచ్ చేసి పాన్ ఇండియా ప్రయత్నమిదని చెప్పకనే చెప్పింది ఈ సినిమా యూనిట్. అయితే కరోనా కారణంగ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ అయిపోగానే సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సుక్కు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.