Monday, May 12, 2025
- Advertisement -

హరితేజ వయసు ఎంతో.. ఆ సిగరేట్ కాల్చడం ఏంటో చూడండి..!

- Advertisement -

హరితేజ.. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కనిపించిన పెద్దగా పేరు రాలేదు కానీ తెలుగు వారికి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది. నితిన్ హీరోగా సమంత హీరోయిన్‌గా వచ్చిన అఆ సినిమాలో మంగమ్మ పాత్ర హరితేజకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం హరితేజ సినిమాల్లో చేస్తూనే పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడ చేస్తోంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది హరితేజ. అందులో భాగంగా కొందరు సెలెబ్రీటీలు సోషల్ మీడియాలో వీడియోలు చిట్ చాట్లతో టైంపాస్ చేస్తున్నారు. తాజాగా హరితేజ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానమిచ్చింది. ఈ సందర్భంగా నెటిజన్ ఓ ప్రశ్న అడుగుతూ.. మీ వయసు ఎంతో చెప్పగలరా? అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ స్పందిస్తూ నా వయస్సు నీను చెప్పిన మీరు నమ్మరు.. నమ్మినా వినరు.. విన్నా అర్థం చేసుకోరంటూ.. నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటాయని.. అయినా చెబుతా అంటూ.. తన బర్త్ డేట్‌ను 24-02-1992 అని చెప్పింది.

దీంతో మీరు ఇంత చిన్న వారంటూ మరికొన్ని కామెంట్స్ పెట్టారు నెటిజన్స్. మరో నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. హిట్ సినిమాలో షీలా పాత్రలో నటించిన మీరు నిజంగా సిగరెట్ కాల్చారా? అని అడగగా.. ఆ ప్రశ్నకు హరితేజ సమాదానమిస్తూ.. అవును.. ఆ సీన్ కోసం నిజంగానే సిగరెట్ కాల్చానని చెప్పింది. ఆ పాత్ర అలా ప్రవర్తించాల్సి ఉండటంతో ఆ పాత్ర డిమాండ్ మేరకు తప్పలేదని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -