- Advertisement -

‘నందిని నర్సింగ్ హోమ్’ మూవీ రివ్యూ!

- Advertisement -
nandini nursing home movie review in telugu

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం “నందిని నర్సింగ్ హోమ్”. బంధువైన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించడంతో అప్పట్నుంచే మంచి ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ నందిని నర్సింగ్ హోమ్‌ ప్రేక్షకుల ను ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

చంద్రశేఖర్ అలియాజ్ చందు (నవీన్ విజయ్ కృష్ణ)కు డబ్బంటే ఎంతో ఇష్టం. బాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో హైద్రాబాద్ వచ్చిన అతడికి, అనుకోకుండా సిటీలోనే పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన నందిని నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా ఉద్యోగం వస్తుంది. డాక్టర్ అవ్వడానికి తనవద్ద ఏ అర్హతా లేకున్నా, దొంగ డాక్టర్‌గా ఆ ఉద్యోగంలో చేరతాడు. నందిని నర్సింగ్ హోమ్‌లో చందు చేరకముందు నుంచే కొన్ని భయానక సంఘటనలు జరుగుతుంటాయి. చందు అక్కడ చేరాక ఈ సంఘటనలు మరింత పెరిగిపోతాయి. దీంతో నందిని నర్సింగ్ హోమ్ పేరు కూడా పడిపోతుంది. ఈ సంఘటనలు అన్నింటికీ కారణం ఎవరు? నందిని నర్సింగ్ హోమ్‍ను దెబ్బతీయాలని ఎవరు చూస్తూంటారు? దీన్ని చందు ఎలా కనిపెడతాడు? ఈ కథలో నందిని (నిత్యా నరేష్), అమూల్య (శ్రావ్య) ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఒక సస్పెన్స్ ను మొదటి నుంచి చివరివరకూ ఆసక్తిగా చూపించిన విధానం చాలా బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ కామెడీగా కనిపించే కథలో మొదటి సీన్‌తోనే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదలుపెట్టడం, క్లైమాక్స్ వరకూ అది ఏమై ఉంటుందా అని ఆలోచించేలా చేయడం బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సస్పెన్స్ ఊహించే విధంగా ఉండకపోవడం మరో బలం. ఇక ఈ సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వైజాగ్ నేపథ్యంలో నడిచే నవీన్ – శ్రావ్యల ప్రేమకథ కూడా బాగుంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్‌ల కామెడీ సినిమాకి మరో హైలేట్. నవీన్ విజయ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా చాలా బాగా నటించడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ అన్నీ ఒక డెబ్యూట్ హీరో స్థాయికి మించి ఉండడంతో ఎక్కడా కొత్త హీరోను చూస్తున్న ఫీలింగ్ కనిపించలేదు. నిత్యా నరేష్ క్యూట్‌గా ఉంది. శ్రావ్య లుక్స్ బాగున్నాయి. జయప్రకాష్ తన స్థాయికి తగ్గ పాత్రలో బాగా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం మేజర్ మైనస్ అని చెప్పుకోవాలి. అక్కడక్కడా సినిమా నెమ్మదిగా వెళ్తుంది. కామెడీ పరవలేదనిపించిన వెన్నెల కిషోర్, సప్తగిరి ట్రాక్ కాస్త ఎక్కువసేపు సాగినట్లనిపించింది. సెకండాఫ్‌లో అసందర్భంగా వచ్చే ఓ పాటను కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి. ఇక లాజిక్ అన్న దాన్ని చాలాచోట్ల పట్టించుకోలేదనే చెప్పాలి.

మొత్తంగా:

ఒక రెగ్యులర్ కమర్షియల్ కామెడీలో ఏ ప్రేక్షకుడైనా కొన్ని అంశాలను కోరుకొని వెళుతుంటారు. ఈ సినిమానూ అలాగే ఊహించుకొని వెళితే, బాగా నవ్వించే ఈ కమర్షియల్ కామెడీతో పాటు అదిరిపోయేలా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉండడం సర్‌ప్రైజ్. సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోరు కొట్టకుండా వచ్చే మంచి కామెడీ నడుస్తోంది. లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అన్నది మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. కామెడీతో అదరహో అనిపించి.. సస్పెన్స్‌తో థ్రిల్ చేసే చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’!

మూవీ రేటింగ్: 3.25

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -