- Advertisement -

సినిమాగా శృంగారతార జీవిత కథ..!

- Advertisement -

ఇది వరకూ సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. అప్పటి నుంచి ఆ తరహా నటీమణుల సినిమాల జీవిత కథలకు క్రేజ్ పెరిగింది. మధ్య లో షకీలా ఆత్మకథ హల్ చల్ చేసింది. తన జీవిత కథను తనే సినిమాగా రూపొందించే ప్రయత్నంలో ఉంది షకీలా. మరి ఆ సినిమాల సంగతి అలా ఉంటే ఇప్పుడు సోనా జీవిత కథ సినిమాగా రానుంది. 

ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించుకొంది. తమిళ, తెలుగు సినిమాల్లో హాట్ రోల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది సోనా. కొన్ని ద్వితీయ స్థాయి శృంగారభరిత సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఐటమ్ సాంగ్స్ చేయడం దగ్గర నుంచి తన అందాల ప్రదర్శన ద్వారా సోనా దక్షిణాదిలో గుర్తింపు సంపాదించుకొంది. అలాగే కొన్ని వివాదాల్లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది.

ఇలాంటి చరిత్రతో ఆమె ఒకటినర్న దశాబ్దాకాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇలాంటి అనుభవాలను ఆమె గ్రంధస్తం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ అనుభవాలను ముందుగా పుస్తకరూపంలో కూర్చి తర్వాత సినిమాగా తెరకెక్కిస్తానని సోనా ప్రకటించుకొంది. తన జీవిత కథకు నిర్మాత, దర్శకుల మధ్య క్రేజ్ ఉందని దాన్ని సినిమాగా తెరకెక్కించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారని కూడా ఆమె ప్రకటించింది. మరి  సోనా సినిమా ఎప్పుడు వస్తుందో.. ఆమె అనుభవాలు ఎంత హాట్ గా ఉంటాయో.. ఆ సినిమా ఎంత సంచలనం అవుతుందో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -