Tuesday, May 14, 2024
- Advertisement -

రెడ్డిగారి అబ్బాయి.. హీరోగా సక్సెస్ అవుతాడా!

- Advertisement -

80లలో వచ్చిన ఒకానొక సూపర్ హిట్ సినిమా “సింధూరపువ్వు’ విజయ్ కాంత్ , రాంకీ, నిరోషా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఆ సినిమాను తమిళం నుంచి డబ్ చేశారు. తెలుగులో అది సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా నిర్మాతగా “సింధూర పువ్వు కృష్ణారెడ్డి’ కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు కూడా చేశారు. 

మరి అలాంటి నేపథ్యం ఉన్న నిర్మాత తనయుడు ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. ఈ రోజు విడుదల అయిన ‘వినవయ్యా రామయ్య” తో హీరోగా మారాడు. నాగ అన్వేష్ అనే ఈ హీరోగా చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సుపరిచితుడే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కు తనయుడిగా నటించి ప్రేక్షకులను నవ్వించిన పిల్లాడే ఇప్పుడు కుర్రాడిగా మారి హీరోగా వచ్చాడు. ఇతడు చైల్డ్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించాడు.

మరి ఇప్పుడు ఇతడు హీరోగా సక్సెస్ అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. తొలి సినిమా గనుక సానుకూల ఫలితాన్ని ఇస్తే ఇతడు దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే.. నటుడిగా తన ప్రతిభ ఏమిటో ఇతడు  చిన్నప్పుడే నిరూపించుకొన్నాడు కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -