గుంటూరుకు చెందిన ఓ అమ్మాయి తన జీవితంపై చాలా కలలు ఊహించుకుంది. తన భర్త గురించి ఎంతో ఊహించుకుంది. ఆమెకు ఓ ఎన్ఆర్ఐ భర్తతో పెళ్లి కావడంతో చాలా సంతోషపడింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… ఆరడుగుల అందగాడు. జీతం కూడా లక్షల్లో ఉంది. ఒక అమ్మాయికి కాబోయే భర్తకు ఇంతకన్న ఉండాల్సింది ఏం ఉంటుంది. వెంటనే సంబంధానికి ఒకే చెప్పి మూడు ముళ్లు వేయించేసుకుని అమెరికా వెళ్లిపోయిందా కొత్త పెళ్లి కూతురు.
ఇండియాలో ఉన్నంతకాలం నలత చేసిందని భర్త దూరంగా ఉంటే నిజమేననుకుంది. తీరా అమెరికా వెళ్లాక అతని అసలు రూపం బయటపడి నివ్వెరపోయింది. ఆ భర్త వికృతమైన లైంగీక కోరికలు ఉన్న లైంగిక ఉన్మాది. ఆమెను తాకడు. కానీ అతనికి లైంగిక కోరికలున్నాయి. ఆమె సున్నితమైన ప్రదేశాల్లో సిగరెట్లతో కాల్చుతూ అతడు లైంగీకానందం పొందుతుండేవాడు.
ఆమె బాధతో విలవిల్లాడుతుంటే చూసి లైంగికోద్రేకం పొందేవాడట. భర్త పెట్టే పెట్టే లైంగిక హింసకు ఆమె ఒళ్లు పచ్చి పుండైంది. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఇంట్లో ఫోన్ లేకుండా చేశాడు. పాస్‌పోర్ట్ చింపేశాడు. బయటికి వెళ్లకుండా ఇంటికి తాళం వేశాడు. కొద్ది నెలల పాటు తీవ్ర నరకం అనుభవించిన ఆ యువతి చివరకు పక్కింటివాళ్ల సాయంతో ఆ నరకం నుంచి బయట పడింది. ప్రస్తుతం ఆమె భర్త చెర నుంచి విడుదలయ్యి ఇండియాకు వచ్చి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Related
