సినిమా రేటింగ్ ఇవ్వలేదని రంకెలేసిన రచయిత!

ఇటీవల విడుదలైన ఒక సినిమాకి రేటింగ్ ఇవ్వలేదని ఒక పెద్ద రచయిత అందరి ముందు, మీడియా ముందు బహిరంగంగానే రొటీన్‌గా తన బాధని వ్యక్తపరిచాడు… అయితే ఇంకో రచయిత మాత్రం తన అసిస్టెంట్స్

దగ్గర మందు పడకుండా మహా కోపంతో ఊగి పోయాడట.. నేను అంత కష్టపడి రాస్తే రేటింగ్ ఇవ్వకపోగా…

పైగా పవన్ కళ్యాణ్ సినిమాతో పోలుస్తారా… అంటూ తన కడుపులో మంటని చల్లారే దాక వాగాడటా… తెల్లగా ఉంటే పాలతో.. నల్లగా ఉంటే బొగ్గుతో పోలుస్తారు. మరి ఆ కథ అలా ఉందని ప్రేక్షకులు అనుకున్నారు కాబట్టే అలా అన్నారు. ఒకవేళ ఆ రచయిత అనుకున్న స్టోరి వేరే అయితే అది సరిగ్గా చెప్పడం రాక… ఇలా ప్రేక్షకులని అటు వెబ్‌సైట్ వాళ్ళని అంటే ఏం లాభం…

ఈ యువ రచయితకి ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ లేదు.. పైగా చేసింది పెద్ద సినిమాలే.. ఇకనైనా సరైన స్టోరి రాసి హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఏడుకొండల వాడా ఇతనికి పెద్ద హిట్‌ని ఇవ్వు స్వామి.. ఇంతకీ ఎవరా 15 సంవత్సరాల రచయితగా ఉన్న యువ రచయిత.. just think….