Friday, May 10, 2024
- Advertisement -

రాజమౌళికి ‘జక్కన్న’ అనే పేరు ఎందుకు వచ్చిదంటే..!

- Advertisement -

దర్శకుడు రాజమౌళిని మీడియా ‘జక్కన్న’గా వ్యవహరిస్తూ ఉంటారు. రాజమౌళి పేరును రాసుకోవాల్సిన వచ్చిన సమయంలో కొన్ని సార్లు ఆయన పేరును రాస్తూనే.. జక్కన్న అని కూడా రాస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది. ఎన్టీఆర్ వంటి హీరోలు అయితే రాజమౌళిని జక్కన్నగానే సంబోధిస్తూ ఉంటారు. మరి ఏమిటీ జక్కన్న..

ఈ దర్శకుడిని ఎందుకలా పిలుస్తారు.. ఈ పేరును ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు.

తాజాగా దర్శకుడు ఆ విషయం గురించి పూర్తిగా వివరించాడు. తనకు ఆ పేరును పెట్టింది రాజీవ్ కనకాల అని రాజమౌళి వివరించాడు. అది “శాంతి నివాసం” సీరియల్ నాడు వచ్చిన పేరు అని రాజమౌళి పేర్కొన్నాడు. ఆ సీరియల్ చిత్రీకరణ తీరును చూసి.. రాజీవ్ కనకాల తనకు ఆ పేరును పెట్టాడని రాజమౌళి వివరించాడు. సీరియల్ ను అమరశిల్ప జక్కన్నలాగా చెక్కుతున్నావంటూ  రాజీవ్ తనకు జక్కన్న పేరును ఇచ్చాడని.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ పేరును పాపులర్ చేశాడని రాజమౌళి వివరించాడు.

ఈ విధంగా తనకు జక్కన్న అనే పేరు వచ్చిందని.. మీడియాలో దాన్ని విస్తారంగా వాడేస్తున్నారని ఈ దర్శకుడు నవ్వుతూ వివరించాడు. ఇదీ రాజమౌళి ‘జక్కన్న’ ఇమేజ్ కు న్న కథ. మరి అందుకు తగ్గట్టుగా ఈ దర్శకుడు బాహుబలిని రెండు సంవత్సరాలుగా చెక్కుతూనే ఉన్నారు కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -