టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కి మంచి పేరుంది.. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి టాప్ దర్శకుల లిస్ట్ లోకి అనతి కాలంలోనే చేరిపోయాడు.. వరుస హిట్ లు పెద్ద హీరోలతో కొట్టడంతో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే హిట్ కొడతామని టాప్ హీరోలు సినిమా లు చేస్తున్నారు.
త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది. ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది.. తరువాత త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్ తోనే అనే వార్తలు వచ్చాయి కాని ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజిగా ఉండడంతో ఈ గ్యాప్ లో ఓ చిన్న బడ్జెట్టు సినిమా చేస్థాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ వార్తలలో వాస్తవం లేదని తెలుస్తుంది.
అయితే మరో మూడు నెలలలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంటున్నా నెపద్యంలో.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కొసం వెయిటింగ్ అనే వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటు… ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈసినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే అనే వార్తలు కూడా వచ్చాయి.. కానీ ఇప్పుడున్నా సమాచారం ప్రకారం కీర్తి సురేశ్ ని తీసుకోవాలని అనుకుంటుందట చిత్ర బృందం. ఈ సినిమా ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో కలసి నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తారు.
టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?
త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?