Sunday, April 28, 2024
- Advertisement -

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

- Advertisement -

రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఏ సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దాంతో చరణ్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో అని అందరు తెగ చర్చించుకుంటున్నారు.. అయితే చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఏ డైరెక్టర్ తో సినిమా ని ఒప్పుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.. నిజానికి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఇదివరకే చేయాలి కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమా కుదరబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యలో మహేష్ బాబు ఈ సినిమా కు అడ్డుపడుతున్నాడని మరో వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా ఎన్టీఆర్ RRR తో కమిట్ లో ఉండడం తో త్రివిక్రమ్ వెయిట్ చేయక తప్పలేదు.. ఎన్టీఆర్‍తో సినిమా లేటయితే కనుక మహేష్‍తో ఈలోగా ఒక సినిమా చేసేయడానికి త్రివిక్రమ్‍ ప్రయత్నించాడు. కానీ ఎన్టీఆర్‍ అందుకు అంగీకరించలేదని, ఆర్‍.ఆర్‍.ఆర్‍. షూట్‍ ముగించుకుని త్వరలోనే ఈ సినిమా మొదలు పెడతానని చెప్పాడని, అంచేత మహేష్‍ సినిమా దీని తర్వాతే వుంటుందని అంటున్నారు.

అదే జరిగితే మరోసారి చరణ్‍-త్రివిక్రమ్‍ కాంబినేషన్‍ వాయిదా పడుతుంది. మరోవైపు త్రివిక్రమ్‍తో సినిమా గ్యారెంటీ అనే నమ్మకంతో కొరటాల శివతో చిత్రాన్ని చరణ్‍ వాయిదా వేసుకోవడంతో అతను అల్లు అర్జున్‍తో మూవీ ఖాయం చేసేసుకున్నాడు. దాంతో చరణ్ కి ఇప్పుడు ఇద్దరు టాప్ దర్శకులతో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోతున్నాడు..  ఈ నేపథ్యంలో మహేష్ డ్రాప్ అయ్యి త్రివిక్రమ్ ను చరణ్ కి ఇస్తాడా లేదా ఇద్దరి సినిమాలు అయిపోయాక ఎవరో ఒకరి తో చరణ్ సినిమా చేస్తాడా అన్నది చూడాలి.. 

సోనియా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే.. సూర్య..?

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -