Saturday, April 27, 2024
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ ఏ దర్శకుడికి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పొటి పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

కొద్దీ సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ కి రచయితగా మంచి పేరుంది.. పవన్ తో భారీ ఫ్లాప్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది. ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది.. దాంతో త్రివిక్రమ్ తిరిగి తన పూర్వ వైభంగా కొనితెచ్చుకున్నాడు.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా ని చేస్తున్న త్రివిక్రమ్ తదుపరి చిత్రం పై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అవుతుంది.. మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ ఇద్దరిలో ఒకరితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..

ఫైనల్ గా మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఇటీవలే వార్తలు రాగ ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయడానికి బన్నీ కూడా ఎదురుచూస్తున్నాడట..త్రివిక్రమ్ తో సినిమా చేస్తే యూత్‍ ప్లస్‍ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉండి సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందనేది ‘అల వైకుంఠపురములో’ విషయంలో స్పష్టమయింది. త్రివిక్రమ్‍తో తన కాంబినేషన్‍ భేషుగ్గా వర్కవుట్‍ అవడంతో మరోసారి త్రివిక్రమ్‍ సినిమాను లైన్లో పెట్టాలని అల్లు అర్జున్‍ ఉవ్విళ్లూరుతున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్‍ ఆ వెంటనే త్రివిక్రమ్‍ సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి త్రివిక్రమ్ మహేష్ రామ్ చరణ్ లతో ఫిక్స్ అయిపోయాడు.. మరి అల్లు అర్జున్ కోరిక ను ఎలా తీరుస్తాడా చూడాలి..

ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యమవుతుండడంతో ఇప్పుడు త్రివిక్రమ్ రామ్ తో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నా.. దానిపై క్లారిటీ రావాలంటే స్వయంగా త్రివిక్రమ్ స్పందించాలి. మరేమో త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -