Tuesday, April 30, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 విజేత ఎవరో అప్పుడే టాం టాం?

- Advertisement -

బిగ్ బాస్ ప్రారంభమైన తరువాత ప్రతివారం ఎలిమినేట్ ఎవరు అవుతారన్న విషయమై సోషల్ మీడియా ముందుగానే చెప్పేస్తోందన్న సంగతి విదితమే. వాస్తవానికి ఈసారి బిగ్ బాస్ లో పరిచయం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. గంగవ్వ,అబిజిత్,సారిక, కరాటే కళ్యాని మినహా అందరూ ప్రేక్షకులకు కొత్త ముఖాలే అని చెప్పొచ్చు. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు పోటీదారులు ఉండగా, ఒకరే విజేతగా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కౌంట్ డౌన్ మొదలైంది.. ఫైనల్ లో ఐదుగురు నిలిచారు. ఇదిలా ఉంటే.. టీవీలో ప్రేక్షకులు చూస్తున్న హౌస్ సీన్లు, ఒక రోజు ముందుగా రికార్డు అయ్యేవే. ఎవరి ద్వారానో ఎలిమినేషన్ విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి.

ఆఖరి వారం విషయంలో మాత్రం లీకు వీరులకు బిగ్ బాస్ షాకిచ్చాడు. అదేంటంటే, ఈ సీజన్ లో విజేతగా అరియానా నిలిచినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల ఓటింగ్ పరంగా చూస్తే హౌస్ లో అభిజిత్ విజేత కావాలని 58 శాతం ఓట్లు వచ్చాయని ఓటింగ్ సరళి చూపుతోంది. అరియానా రెండో స్థానంలో ఉండి 18 శాతం ఓట్లను సాధించగా, మిగతా పోటీలో ఉన్న సొహైల్ హారిక, అఖిల్ నామమాత్రపు ఓట్లతోనే ఉన్నారు. అయితే చివర్లో అబిజిత్, అఖిల్ మద్య గట్టి పోటి ఉంటుందని మరికొంత మంది లీక్ వీరులు చెబుతున్నారు.

ఈ ఉదయం ఓ చీఫ్ గెస్ట్ ను వేదికపైకి తెచ్చి, మిగతా భాగం షూటింగ్ ను తీసి, సాయంత్రం ప్రసారం చేస్తారని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి. గత మూడు సీజన్లలో పురుషులే విజేతలు. సీజన్ 1లో హరితేజ, అర్చన చివరిదాకా ఉన్నా టైటిల్ దక్కలేదు. సీజన్ 2లో గీతామాధురి రెండో స్థానంలోనిలవగా, సీజన్ 3లో యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా ఉంది. మరి ఈసారి మహిళా విన్నర్ గా చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అరియానా కు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ విజేత ఎవరో మనముందు ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -