Tuesday, May 7, 2024
- Advertisement -

ఉజ్జయిని మహాకాళ్ దగ్గరలో బయట పడ్డ పురాతన ఆలయం!

- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అద్భుతం వెలుగు వెలుగు చూసింది. దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్న వేళ, ఈ అద్భుతం జరిగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పురాతత్వ విభాగానికి చెందిన అధికారులు ఆలయానికి చేరుకున్నారు.  ఈ ప్రాంతంలో పురాతన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారని స్థానికులు అంటున్నారు.

పూర్తిగా తవ్వకాలు జరిపి, ఆలయాన్ని వెలుగులోకి తెస్తే, దాని నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రమణ్ సోలంకీ మాట్లాడుతూ మహాకాళ్ మందిర విస్తరణ కోసం స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో తవ్వకాల పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ తవ్వకాల్లో పురాతన ఆలయం, కొన్ని పురాతన కళాకృతులు బయల్పడ్డాయన్నారు. పూర్తిగా తవ్వకాలు జరిపిన తరువాత ఆలయ నిర్మాణ తీరుతెన్నులు తెలుస్తాయన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -