- Advertisement -

గుంకలాంలో ‘వైయస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్ ను ఆవిష్కరించిన ఏపి సీఎం వైఎస్ జగన్!

- Advertisement -

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్‌. ఈ పర్యటనలో భాగంగా గుంకలాంలోని ‘వైయస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఇక గుంకలాంలో 397.36 ఎకరాల్లో అతి పెద్ద లేఔట్ ను అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం 12,301 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద లేఔట్ ఇదే కావడం గమనార్హం. లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు.

ఆ తర్వాత 2 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు సీఎం. ఆ తర్వాత 2 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు సీఎం. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్‌ పాల్గొనే సభా ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను జగన్ నిజం చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా, ఇళ్లను కూడా కట్టిస్తామని అన్నారు. ఇక మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, పేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలను ఇచ్చిన ఘనత కేవలం జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -