Sunday, May 5, 2024
- Advertisement -

ఎమ్మెల్యే రోజాకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసా?

- Advertisement -

రోజా ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేవారు. “ప్రేమ తపస్సు” సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన రోజా ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి అవకాశాలను దక్కించుకుంది. సినిమాలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రోజా మెల్లగా తన అడుగులను రాజకీయాల వైపు మళ్లించింది. ఆ విధంగా రాజకీయాలలోనూ ఇటు పలు టీవీ కార్యక్రమాలను ఎంతో సమన్వయంగా వ్యవహరిస్తూ అని బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలలో నటించడం, మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో జడ్జి గా వ్యవహరించడంతో తనను ప్రజలకు మరింత చేరువ చేసిందని రోజా తెలియజేశారు.

రోజా, బాలకృష్ణ సరసన “భైరవద్వీపం” సినిమాలో నటించడంతో ఆమె కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలో నటించిన తర్వాత రోజా తన కెరీర్ పరంగా వెనుతిరిగి చూడలేదు. తన సినిమా జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రోజాకు సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం” అన్నమయ్య” అని చెబుతారు. అన్నమయ్య సినిమాలో రోజా ప్రధాన పాత్రలో నటించకపోయినా, ఆ వెంకటేశ్వర స్వామిపై తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలియజేశారు.

అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పై చిత్రీకరించడం పట్ల ఆ స్వామివారి పై నమ్మకం ఉండటమే కాకుండా, ఈసినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు ఈమె తెలిపారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్లే నగరి నియోజకవర్గంలో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని రోజా పలు సందర్భాలలో తెలిపారు.ఈ విధంగా రోజా తన కెరియర్ లో హీరోయిన్ గా నటించిన సినిమాల కంటే అన్నమయ్య సినిమాలో నటించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -