Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రధానికి లేఖ‌రాసిన‌ కేజిఎఫ్ ఫ్యాన్స్..!

- Advertisement -

కేజిఎఫ్ 2 సినిమా మీద ఉన్న అంచ‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. టీజ‌ర్ రిలీజ్ అయిన ముడు రోజుల్లోనే 14 కోట్ల వ్యూయ‌ర్ షిప్ ను సాధించింది అంటే అర్థం చేసుకోవాలి. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ‌హుబ‌లి కూడా ఈ రెంజ్ లో వ్యూయ‌ర్ షిప్ ను సాధించ‌లేదు అంటే.. దేశంలో కేజీఎఫ్ హ‌వా ఎలా న‌డుస్తుందో తెలుసుకోవ‌చ్చు.

ఈ సినిమా రోజురోజుకూ ఒక కొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. ఇప్ప‌టికి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతునే ఉంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అమ్మకాల్లో కూడా సినీ యూనిట్ మంచి రాబ‌డులు సాధిస్తోంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఈ సినిమా మొద‌టి భాగంలో త‌ల్లి, కొడుకుల ప్రేమ‌ను డైరెక్ట‌ర్ ఎంతో గొప్ప‌గా చూపించాడు.

అయితే ఈ కేజిఎఫ్ 2 సినిమా జులై 16న విడుదల అయ్యేందుకు సిద్ద‌మ‌వుతోంది. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్స్ ను ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ రోజుని నేషనల్ హాలీడే గా ప్రకటించాల‌ని హీరో యష్ అభిమానులు కోరుతున్నారు. దీనికి సంబంధిచిన లేఖ‌ను కూడా ప్ర‌ధానికి పంపుతున్న‌ట్లు చెబుతున్నారు.ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది ఎంతో మంది కోరిక అందుకే హాలిడే ప్ర‌క‌టించాల‌ని పీఎంకు లేఖ రాసిన‌ట్లు వారు చెబుతున్నారు.

సుమంత్ అశ్విన్‌ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -