అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!

pavan meets chiru

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తూనే.. మరో వైపు రాజకీయాలలో ఆక్టివ్ గా ఉంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పై కాస్త గుర్రుగా ఉన్నారు అన్న మాట నిజమే.

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ రాకపోవడం ఫ్యాన్స్‌ను బాగా నిరుత్సాహపరిచింది. అయితే ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలకు ముందు తన ట్విట్టర్ ద్వారా చిరంజీవికి.. ఆయన భార్య సురేఖకు.. రామ్ చరణ్ కు అభినందనలు తెలిపాడు పవన్ కళ్యాణ్. తాజాగా ఖైదీ నంబర్ 150 సినిమాని పవన్ స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. వీటన్నిటితో పాటు.. ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

ఖైదీ సక్సెస్ తో పాటు.. మెగాస్టార్ కంబ్యాక్ ను అభినందించాడట పవన్. అంతే కాకుండా.. కొన్ని గంటల పాటు వదినమ్మ సురేఖతో మాట్లాడాడట కూడా. తను ఎంత బిజీగా ఉన్నా అన్నయ్య ఫ్యామిలీతో కలిసి ఉన్నంతసేపు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని.. వీలైనంత టైం గడిపాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత యథావిధిగా తన కాటమరాయుడు సినిమా షూటింగ్ కి పవర్ స్టార్ వెళ్లాపోయాడని తెలుస్తోంది.

Related

  1. పవన్ “కాటమరాయుడు” కథ ఇదే…
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  3. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  4. పవన్ టార్గెట్ ని త్రివిక్రమ్ అందుకుంటాడా..?