Friday, May 17, 2024
- Advertisement -

పవన్ టార్గెట్ ని త్రివిక్రమ్ అందుకుంటాడా..?

- Advertisement -
Pawan kalyan Set Release Date for Trivikram Film

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పవన్-త్రివిక్రమ్ సినిమాకి రకరకాల టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు.

అయితే.. సెట్స్ పైకి వెళ్లలేదు కానీ.. అప్పుడు ఈ మూవీకి రిలీజ్ డైట్ ఫైనల్ చేసేశారట. ఆగస్ట్ 11న పవన్-త్రివిక్రమ్ ల మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వీకెండ్ తర్వాత ఆగస్ట్ 14న కృష్ణాష్టమి.. 15న ఇండిపెండెన్స్ డే హాలిడేస్ ఉన్నాయి. అందుకే ఈ డేట్ కి సెట్ అయ్యారట. అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ అంటే.. ఆలోచించాల్సిందే. నిజానికి ఫిబ్రవరి మొదటివారానికే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ కాటమరాయుడు ఫినిష్ అయ్యే సరికే ఫిబ్రవరి పూర్తయిపోతుందట. అంటే మార్చ్ మొదటివారంలో కానీ త్రివిక్రమ్ సినిమాని పవన్ ప్రారంభించే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఐదు నెలల్లో పవన్ కళ్యాణ్ తో భారీ చిత్రాన్ని పూర్తి చేయడం అంటే.. త్రివిక్రమ్ కు చాలా పెద్ద టార్గెట్ అనాల్సిందే. గతంలో నితిన్ తో చేసిన అ ఆ సినిమా కూడా ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తానని 8 నెలల సమయం తీసుకున్నాడట త్రివిక్రమ్. ఇప్పుడు పవన్ సినిమాని ఐదు నెలల్లో కంప్లీట్ చేయడం సాధ్యం అనేది డౌట్. 

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  2. పవన్ పంచెకట్టు వెనక ఉన్న రహస్యం చెప్పారు!
  3. రావు రమేష్, పవన్ కు మధ్య గొడవ
  4. పవన్ కళ్యాణ్ కి మామగా సూపర్ స్టార్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -