- Advertisement -
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఆయన ఇంట్లో సంబారాలు మొదలయ్యాయి. బెయిల్ వార్త వినగానే ఫ్యామిలీ ఉద్వేగానికి గురై ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు.
ఆయన కూతురు ఆనందబాస్పాలతో కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ పోరాటానికి కుటుంబం మొత్తం అండగా ఉంటుందని గీత చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఎదుర్కొవాల్సి వస్తుందనుకున్నాం కానీ కుట్రను ఎదుర్కొవాల్సి వస్తుందనుకోలేదని ఆయన భార్య గీత ఉద్వేగంగా పేరొన్నారు.
తెలుగు దేశం పార్టీ నెల రోజుల నుంచి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రేవంత్ అభిమానులు ఆయన ఇంటి వద్ద సంబరాల్లో మునిగారు.
