Monday, May 27, 2024
- Advertisement -

తెలుగుదేశం రోజుకొక డిమాండ్ తో కామెడీ చేస్తోంది!

- Advertisement -

ఒక రోజేమో హైదరాబాద్ లో ఏపీ పోలిస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అంటారు.. మరో రోజు హైదరాబాద్ లో సెక్షన్ ఎనిమిదిని అమలు చేయాలంటారు..

ఇక్కడ శాంతిభద్రతలు దారుణాతి దారుణమైన స్థితిలో ఉన్నాయి కాబబట్టి విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిదిని అమలు చేయమంటారు. ఇక రాష్ట్రపతి పాలన విధించాలని.. హైదరాబాద్ ల పాలన గవర్నర్ చేతుల్లో ఉండాలని కూడా డిమాండ్ చేశారు.

ఇలా వరసగా చేస్తున్న డిమాండ్లలో ఏదీ సాధించుకోలేదు కానీ.. తెలుగుదేశం వారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. హైదరాబాద్ ను యూటీగా చేయాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని.. వీరు కోరుతున్నారు. తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ డిమాండ్ ను వినిపించాడు. 

మరి తెలుగుదేశం నేతలు ఎందుకు ఇలా రోజుకొక డిమాండ్ ను తరపైకి తెచ్చి తాపత్రయపడుతున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఓటుకు నోటు వ్యవహారం రచ్చకు ఎక్కినప్పటి నుంచి.. తమ అధినేత ఇబ్బందుల్లో పడినప్పటి నుంచి వీరు ఇలాంటి రచ్చ చేస్తున్నారు. ఏదో విధంగా ఆ వ్యవహారం చర్చలోకి రాకుండా.. చిత్ర విచిత్రమైన డిమాండ్లతో వీరు తెరపైకి వస్తున్నారు. మరి ఇదంతా జనాలకు అర్థం అవుతోందని టీడీపీ వాళ్లకు తెలిసే ఉంటోంది కాబోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -