ఈ హెడ్డింగ్ చూసి షాక్ కాకండి.. మెగా హీరో వరుణ్‌తేజ్ నాని హీరోయిన్‌తో లవ్‌లో పడ్డాడు. అదేంటి ఇండస్ట్రీలో వరుణ్‌తేజ్ చాలా సైలెంట్ గా ఉంటాడుగా.. అలాంటి మన హీరో అప్పుడే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడా అన్న అనుమానాలు మనకు వచ్చేస్తాయి. అయితే మరి మనోడు ఏ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడో.. ఆ కథ ఏంటో చూద్దాం… మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్నాడు.
కంచె హిట్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ 2016లో తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం వరస సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. వరుణ్ ఈ యేడాది మిస్టర్, ఫిదా వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు 2017లోనే థియేటర్లలోకి రానున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వరుణ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో నానీ లవర్‌తో రొమాన్స్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
నాని సరసన కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమాలో హీరోయిన్గా చేసిన ఫేమ్ మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే మోహ్రీన్ రవితేజ, సాయిధరమ్ తేజ్ సరసన మరో రెండు సినిమాలకు హీరోయిన్గా ఎంపికైంది.
Related