సింహాద్రి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!! 

Rasna baby Ankitha second innings in NTR’s Jai Lava Kusa

సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అంకిత గుర్తుంది కదూ. ఈమె ఎవరో కాదు.. చిన్నప్పుడు ఐ లవ్ యు రస్నా అంటూ యాడ్ లో పలకరించిన చిన్న పిల్లే. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించిన ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కాగా ఈ బొద్దుగుమ్మ  తాజాగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశలో ఓ చిన్న పాత్రలో మెరవనుందట ఈ అమ్మడు. మరి సెకండ్ ఇన్నింగ్సైనా ఈ అమ్మడికి కలిసివస్తాయేమో చూడాలి.