- Advertisement -

నీ ధైర్యం ఎందరికో స్పూర్తి.. ‘లవ్యూ జిందగీ’ యువతి మరణంపై సోనూ సూద్ విచారం..

- Advertisement -

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో మనుషుల ప్రాణాలు చూస్తుంటే గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతిరోజూ మన కళ్ల ముందు ఉన్నవారు.. కరోనా మహమ్మారి తో కన్నుమూస్తున్నారు. ధైర్యంగా ఉన్నవాళ్లను సైతం మృత్యువుకు బలిచేస్తోంది. ఈ మద్య కరోనా వార్డులో ఓ అమ్మాయి ఎమర్జెన్సీ వార్డులో కరోనాకు చికిత్స పొందుతూ, ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సెలైన్ తో షారూఖ్ ఖాన్, ఆలియా భట్ నటించిన లవ్ యూ జిందగీ లోని సాంగ్ వినుకుంటూ ఎంతో ఉత్సాహంగా కనిపించడాన్ని చాలామంది అభినందించారు.

ఆ యువతి మనో ధైర్యాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకున్నారు.. కరోనా తో కృంగిపోకుండా బతుకుతాం అన్న ధైర్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి అమ్మాయి కరోనా కాటుకు బలైపోయిన ఎంతో మందిలో తానూ ఒకరిగా మారిపోయి అందరినీ విషాదానికి గురిచేసింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. జీవితం ఇంత కిరాతకమైనదా? అంటూ ఆ 30 ఏళ్ల యువతి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇది చాలా చాలా విషాదకర ఘటన అని.. మళ్లీ తన కుటుంబసభ్యులను చూడలేనని ఆమె ఏమాత్రం ఊహించి ఉండదు. జీవితం చాలా బాధాకరమైనదని అనిపిస్తోంది.మన జీవితం ఎలా సాధారణ స్థితికి వస్తుందన్నది పక్కనబెడితే, ఇలాంటి దుర్దశను అధిగమించడం ఎంతో కష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు సోనూ సూద్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -