Thursday, May 2, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలో మహేష్ బ్యూటీ.. ఎవరంటే?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 35వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుందని ఇదివరకే ప్రకటించారు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్-శివ కాంబోలో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తుంది.కియారా అద్వాని కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించారు.

Also read:బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కియారాను ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. తెలుగులో వినయ విధేయ రామ సినిమా తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి క్రేజీ హీరోయిన్ గా మారిన కియారా బిజీ షెడ్యూల్ కారణంగా తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ప్రస్తుతం కొరటాల శివ “ఆచార్య” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -