- Advertisement -

రామ్ చరణ్ కొత్త లుక్ లీక్.. ఆ సినిమా కోసమే!

- Advertisement -
Ram Charan Look Revealed In Sukumar Film

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 30న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ నెల 20 తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ లో చరణ్ కూడా పల్లెటూరి కుర్రోడిగా కనిపించబోతున్నారు.

అయితే ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే గడ్డాన్ని పెంచుతున్నట్లు తెలిసింది. నిన్నవిజయనగరంలోని చెరుకుపల్లి అవంతి ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఇదే లుక్ తో  పాల్గొన్నారు. 1990 కాలంలో ఓ గ్రామంలో జరిగిన అందమైన లవ్ స్టోరీ ని సుకుమార్ వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఆనాటి యువతిగా సమంత తన అమాయకత్వమైన నవ్వుతో మరోసారి అందరి హృదయాలను దోచుకోనుంది.

ఈ మూవీ కోసం మనసుకు హత్తుకునే డైలాగ్స్ ని సాయి మాధవ్ బుర్రా రాసారని చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. రత్నవేలు కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

{youtube}MWoabj9AjCU{/youtube}

Related

  1. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్
  2. రామ్ చరణ్ కొత్త ఇల్లు రెడీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
  3. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..?
  4. చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -