మనదేశంలో విడాకులు ఇచ్చిన మహిళ పట్ల ప్రజలు ఎంతో చులకన భావనతో చూస్తారు. ఈ క్రమంలోనే తన తప్పు లేకున్నప్పటికీ తనపై నిందలు వేయడం ఈ సమాజానికి అలవాటేనని నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ షెఫాలి జరీవాలా అన్నారు. మగాడు ఎన్ని తప్పులు చేసినా.. పది పెళ్లిళ్లు చేసుకున్న నోరుమెదపని ఈ సమాజం మహిళా రెండో పెళ్లి చేసుకుంటేనే ఆమె వ్యక్తిత్వాన్ని శంకిస్తారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2002 వ సంవత్సరంలో కాగా కాంటా లగా పాటతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందిన షెఫాలీ.. నచ్ బలియే 2, బిగ్బాస్ 13 వంటి పలు రియాలిటీ షోలతో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందారు. 2004వ సంవత్సరంలో మ్యుజీషియన్ హర్మీత్ సింగ్ను వివాహంచేసుకున్న ఈమె కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో వీరిరువురు 2014వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే షెఫాలీ నటుడు ప్రయాగ్ త్యాగిని రెండవ వివాహం చేసుకున్నారు.
Also read:కియారా అద్వానీపై టాలీవుడ్ హీరోల ఫోకస్..?
ఈ సందర్భంగా ఆమె రెండో పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొని ఉందని తాజాగా నటి తీవ్ర ఆవేదన చెందారు.కేవలం రెండో పెళ్లి చేసుకునంత మాత్రాన వారికి వ్యక్తిత్వం ఉండదా… నేను నా మొదటి భర్తతో విడిపోయినప్పుడు చాలా మంది నన్ను ఉద్దేశించి తను కాంటా లగా గర్ల్ కదా, బోల్డ్ కదా,తను ఏదో తప్పు చేసి ఉంటుంది అందుకే విడాకులు ఇచ్చారు అంటూ వారికి తోచిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. సినిమాలలో వేశ్య పాత్రలలో, బోల్డ్ గా కనిపిస్తే నిజజీవితంలో కూడా అలాగే ఉంటారా అంటూ తన పై వచ్చిన మాటలను తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Also read:శ్రీరాముడిగా సంపూర్ణేష్ బాబు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు?