Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీరాముడిగా సంపూర్ణేష్ బాబు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు?

- Advertisement -

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాల ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ ఎంటర్టైనర్ లో తెరకెక్కే సంపూర్ణేష్ బాబు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గత కొద్దిరోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంపూర్ణేష్ బాబు తాజాగా “క్యాలీఫ్లవర్” అనే సినిమాలో నటించారు.

ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా నటించిన క్యాలీఫ్లవర్ చిత్రాన్ని గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్రకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

క్యాలీఫ్లవర్ సినిమాలో సంపూర్ణేష్ బాబు శ్రీ రాముడు వేషధారణలో ఉన్నటువంటి పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ సినిమాలో సంపు ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్ వ్యక్తిగా సందడి చేయనున్నారని ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం శ్రీరాముడు వేషధారణలో ఉన్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

Also read:వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బరువు పెరుగుతారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -