Sunday, April 28, 2024
- Advertisement -

సండే స్పెషల్.. నాటుకోడి పులుసు ఎలా చేయాలంటే?

- Advertisement -

రాయలసీమ అంటేనే నాటుకోడి పులుసు ఎంతో ప్రత్యేకం. ఈ నాటు కోడి పులుసు తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. మరి రాయలసీమ రుచిని ఆస్వాదించాలి అంటే, నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
నాటుకోడి అరకిలో, ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, దనియాల పొడి టేబుల్ స్పూన్, కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్, అల్లం రెండు చిన్న ముక్కలు, లవంగాలు 3, ఉప్పు, పసుపు చిటికెడు తగినంత, నూనె కొద్దిగా.

తయారీ విధానం:

  • ముందుగా నాటుకోడిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ధనియాల పొడి, కొత్తిమిర, కొబ్బెర, అల్లం, లవంగాలు వేసి రుబ్బు రోటిలో మెత్తటి మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి.

*ఈ విధంగా మసాలా రుబ్బురోలులో రుబ్బటం వల్ల చికెన్ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా మసాలాని మొత్తం తయారు చేసుకున్న తరువాత స్టవ్ పై కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి.

*నూనె కాగిన తర్వాత అవసరమనుకుంటే పోపుదినుసులు వేసుకోవచ్చు లేకపోతే లేదు. అందులోకి ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి.

*రెండు నిమిషాల పాటు చికెన్ ముక్కలు నూనెలో వేగిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి మరో రెండు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.

*రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలియబెట్టి ముందుగా తయారు చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని వేయాలి. తక్కువ మంటపై ఈ మసాలాను ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా చేయటంవల్ల మసాలా పచ్చి వాసన రాకుండా ఉండటమే కాకుండా ముక్కలకు బాగా అంటుకుంటుంది.

Also read:నటి బాబీ లహరీ కష్టాలు తెలిస్తే షాక్ అవుతారు?

*ఐదు నిమిషాల తర్వాత ఈ చికెన్ లోకి కారం వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. పెళ్లి నిమిషాల తర్వాత మనకు కావలసిన నీటిని వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి.

*నాటుకోడి కొద్దిగా గట్టిగా ఉంటుంది కనుక ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం వెళ్లిపోయిన తర్వాతే కుక్కర్ మూత తీయాలి.

Also read:బాలీవుడ్ లో నాంది.. హీరో అతడే?

*కుక్కర్ మూత తీసిన తర్వాత ఆవిరి నీరు అందులో పడి ఉంటాయి కనుక మరో రెండు నిమిషాల పాటు ఆన్ చేసి చిన్న మంటపై ఎక్కించు కోవడం ద్వారా ఎంతో రుచికరమైన రాయలసీమ నాటుకోడి పులుసు తయారైనట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -