Tuesday, April 30, 2024
- Advertisement -

నాటు సాంగ్ పై మ‌హేశ్ కామెంట్స్

- Advertisement -

నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ గ్రాండ్ గా విడుద‌లైన ఆర్ఆర్ఆర్ పై సామాన్యుల్లోనే కాదు సెల‌బ్రిటీల్లోనూ ఉత్సుక‌త నెల‌కొంది. అందుకే చాలా మందు సినిమా విడుద‌లైన వెంట‌నే చూసేసి .. జ‌క్క‌న్న టీమ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా హీరో మహేశ్ బాబు ఆర్ఆర్ఆర్ పై త‌న అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. సినిమాలు ఉంటాయి కానీ అందులో రాజమౌళి సినిమాలు వేరనన్నాడు మహేశ్ బాబు.

ఆర్ఆర్ఆర్ ఎపిక్ అనీ… ఆ విజువల్స్, సంగీతం, ఎమోషన్స్ ఊహాతీతంగా, ఆశ్చర్యపోయేలా ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. ఆర్ఆర్ఆర్‌లాంటి ప్రాజెక్ట్ చేసినందుకు మొత్తం టీమ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు సూపర్ స్టార్. అంతే కాకుండా నాటు నాటు పాటకు స్పెషల్‌గా ఓ ట్వీట్ చేశాడు. భూ ఆక‌ర్ష‌ణ శ‌క్తి అనేది లేకుండా గాల్లో డ్యాన్స్ చేశారన్నాడు.

ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. వారి స్టార్‌డమ్‌కు అతీతంగా ఎదిగి ఇలాంటి పర్ఫార్మెన్స్‌ను చేశార‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. కొన్ని సన్నివేశాలు తమను తాము మరిచిపోయేలా చేస్తాయని, ఇది కేవ‌లం ఒక మాస్ట‌ర్ స్టోరీ టెల్ల‌ర్ కే సాధ్య‌మంటూ రాజ‌మౌళిని ప్ర‌శంసించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -