కొత్త గెటప్ లో అదరగొట్టిన బన్నీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

Allu Arjun DJ Movie Release Date Confirmed

డీజే- దువ్వాడ జగన్నాధం.. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మిన్ గెటప్ ని ఇప్పటికే టీజర్ లో కనిపించి అదరగొట్టాడు. అయితే.. డీజేలో అల్లు అర్జున్ మరో రోల్ చేస్తున్నాడని.. అది చాలా స్టైలిష్ గా ఉండబోతుందని ఇప్పటివరకూ అనుకోవడమే తప్ప.. నిజానిజాలు తెలియవు.

ఇప్పుడు అంచనాలను నిజం చేస్తూ.. అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ను మించుతూ న్యూ గెటప్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సూట్ లో చేతిలో సూట్ కేస్ పట్టుకుని.. స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అన్న రేంజ్ లో ఉన్న గెటప్ అందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. అల్లు అర్జున్ రెండో గెటప్ ఏ రెంజ్ లో ఉంటుందో చెప్పేశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని కూడా చెప్పేయడం విశేషం.

జూన్ 23న డీజే మూవీని రిలీజ్ చేయబోతున్నట్లి దర్శక నిర్మాతలు నుంచి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మే నెలలోనే రిలీజ్ చేద్దామని అనుకున్న.. చివరికి క్లైమాక్స్ పార్టీ షూట్ కంప్లీట్ కకపోవడంతో రిలీజ్ డేట్ మారింది. మరోవైపు.. జూన్ 23న విడుదల కావాల్సిన మహేష్ బాబు స్పైడర్.. ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అవడంతో.. అదే డేట్ కు డీజేను విడుదల చేస్తున్నారు. సమ్మర్ కు పర్ఫెక్ట్ ముగింపు పలికేందుకు బన్నీ రెడీ అయిపోతున్నాడు. 

{loadmodule mod_sp_social,Follow Us} 

Related

  1. బన్నీని డైరెక్ట్ చేయనున్న నాని
  2. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బన్నీ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా..?
  3. మళ్లీ పవన్ ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ మధ్య.. పెద్ద గొడవ.. ఏం జరిగింది..?
  4. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్