Monday, May 13, 2024
- Advertisement -

అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్

- Advertisement -
Ravi Kiran On Abn Andrajyothi

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇంటూరి రవికిరణ్ పేరు వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై అసభ్యకర ప్రచారం చేసినందుకు తూళ్లూరు పోలీసులు రవికిరణ్ ను అరెస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో గందరగోళం ఏర్పడింది. అంతేకాకుండా రవికిరణ్ అరెస్టుకు నిరసనలు వెల్లువెత్తాయి. లోకేష్ పై సోషల్ మీడియా వేదికగా.. తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రవికిరణ్ అరెస్ట్ హై డ్రామాల మధ్య జరిగింది. ఈ విషయాన్ని ఓ టీవీ లైవ్ షోలో వెల్లడించాడు రవి.

అసత్య ప్రచారం చేసిన ABN కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.. అసలు ఏం జరిగింది అక్కడ.. శంషాబాద్ లో తెల్లవారుజామున.. రవికిరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. ఎక్కడి తీసుకెళ్తున్నారో..కనీసం తన భార్యకి కూడా చెప్పకుండా.. గుంటూరుకి తరలించారంట. ఆ తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారో.. ఓ ఫోటో చూపించి… ఈ ఫోటోలో సభను కించపరిచినందుకు.. నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారట. ఆ తర్వాత రవికిరణ్.. అసలు ఆఫోటోలో ఉన్న అర్ధం వేరే అని చెప్పాడట. అది సభను కించ పరిచేలా పెట్టలేదని.. కేవలం లోకేష్ పెద్దల సభకు వెలుతున్నాడన్న సెన్స్ వచ్చేలా మాత్రమే పెట్టిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. వెనక ఉండి ఎవరో సపోర్ట్ చేస్తున్నారని అడిగారంట. వైసీపీ నేతల హస్తం ఉందా అని అడగటంతో.. దానికి రవికిరణ్ అలాంటిదేమి లేదని.. పూర్తిగా నా వ్యక్తిగతమని చెప్పారంట. అందులో ప్రతి ఫోస్ట్ నా వ్యక్తిగతం అని చెప్పారంట.

ఈ విధంగా రవికిరణ్ ఉన్న నిజం చెపితే.. నిన్న మరో కథనాన్ని ABN ప్రసారం చేసింది. వైసీపీ నేతల అండతోనే రవికిరణ్.. ఆ పేజీ నడుపుతున్నట్లు కథనాలు ప్రసారం చేసింది. రవికిరణ్ ఆ విషయాన్ని కూడా.. ఒప్పుకున్నాడని, సాక్షి నుంచి నెల నెలా జీతం తీసుకుంటున్నట్లుగా వార్తలు ప్రచురించారు. ఇలా అక్కడ జరిగింది .. ABNకి మాత్రమే చెప్పినట్టుగా వార్త వండి వార్చారు. ఈ సంగతిని మిగతా వెబ్ సైట్లు కూడా రాశాయి. ఇదే విషయాన్ని వాసిరెడ్డి పద్మ లైవ్ లో రవికిరణ్ ని అడిగింది. దానికి అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు రవికిరణ్. వాళ్లు అడిగిన మాట వాస్తమే కాని.. నేను అలా చెప్పలేదు. ఇది నా పూర్తి వ్యక్తిగతమని పోలీసులతో చెప్పినట్టుగా రవికిరణ్ లైవ్ లో చెప్పారు. ఆ తర్వాత ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకుని ఇంటిరి పంపించారని రవికిరణ్ చెప్పాడు. ఈ దెబ్బతో.. ఎల్లో మీడియా కుట్ర మరోసారి బయటపడింది. 

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related

  1. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  2. లోకేష్‌పై రోజా కామెడీ పంచ్‌లు
  3. కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ను వినియేగించ‌కుండా మార్గ‌ద‌ర్శ‌ కాలు జారీ చేసిన కేంద్రం
  4. టీడీపీ వల్ల కానిది.. వైసీపీ ఎంపీ చేసి చూపించి. దట్ ఈజ్ వైసీపీ ఎంపీ అనిపించుకుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -