ఈ టైటిల్ నిజమే.. అల్లు అర్జున్ సినిమాకి నాని డైరెక్టర్ గా చేయనున్నాడట. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో నాని “నిన్నుకోరి” అనే సినిమాని చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వైజాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇలా హీరోగా బిజీగా ఉన్న నాని ఫై ఈ రూమర్ రావడానికి బలమైన కారణం ఉంది. నాని అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తున్న టైంలో అల్లు అర్జున్ ని కలిసి సూపర్ స్టోరీ వినిపించాడట. అప్పుడే కలిసి సినిమా చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ హీరోలుగా బిజీ కావడంతో ఆ ప్రాజక్ట్ అక్కడితో ఆగిపోయింది. కానీ అప్పటి నుంచి ఇద్దరూ కలిసినప్పుడల్లా ఆ స్టోరీ పై డిస్కషన్ చేసుకునే వారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కలిసిన వీరిద్దరూ ఆ ప్రాజక్ట్ ని మొదలు పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారంట. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం పక్కా అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
{youtube}v=fhTxtaWPvds{/youtube}
Related
