Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్

- Advertisement -

దర్శకుడు గోపీ గణేష్, హీరో సత్యదేవ్ కాంబినేషన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న మూవీ గాడ్సే. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. అంచలంచలుగా హీరోగా ఎదిగాడు సత్యదేవ్. గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన సినిమా బ్లఫ్ మాస్టర్. ఈ సినిమా వీరురువురికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో చిత్రం తెరకెక్కుతుండటంతో అంచనాలు పెరిగాయి. అయితే గాడ్సేలో హీరోగా తొలుత పవన్ కల్యాణ్‌ను అనుకున్నాడు దర్శకుడు గోపీ గణేష్‌. ఒక బొమ్మ తుపాకీ కూడా ఉపయోగించడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. సీరియల్ కిల్లర్‌గా మారే కథే గాడ్సే.

అయితే ఈ కథ, ఒరిజినల్ గాడ్సే కథకు ఏ సంబంధం లేదంటున్నాడు దర్శకుడు. ఈ కథను పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నట్లు తెలిపాడు. అయితే పవర్ స్టార్‌ దగ్గరకు వెళ్లలేకపోయానంటున్నాడు. చూడాలి మరి సత్యదేవ్ .. గాడ్సేగా ఎలా అలరిస్తాడో.

Also Read

1.భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నజ్రియా

2.సలార్ మూవీపై క్రేజీ అప్‌డేట్

3.పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -